khammam: ఉపాధి పనుల ఆలస్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

28 Aug, 2021 10:50 IST|Sakshi
ముల్కపల్లిలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శృతిఓఝా

సాక్షి, గద్వాల(మహబూబ్‌ నగర్‌): జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉన్న మండలంలో కూడా ఉపాధిహామీ పనులు ఆలస్యంగా కొనసాగడమేంటని, పనులు వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్‌ శృతిఓఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మండలంలోని తెలుగోనిపల్లి, ముల్కలపల్లి, బీరెల్లిలో పర్యటించి ఉధిహామీ పనులను పరిశీలించారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్లు పనులను పరిశీలించారు. అదేవిధంగా ఉపాధి పనులకు సంబంధించి రికార్డులను తనిఖీ చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. ఉపాధిహామీ పనులకు సంబంధించి ఖచ్చితంగా బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జాబ్‌కార్డులున్న ప్రతిఒక్కరికి పనులు కల్పించాలని, పనులు జరిగే సమయంలో కూలీల వద్ద జాబ్‌ కార్డులుండేలా చూడాలని సూచించారు. మస్టర్, డాక్యుమెంట్లు వంటివి ఎప్పటికపుడు అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉమాదేవి, ఎంపీడీఓ సూరి, ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: ఇన్‌స్పెక్టర్‌ అరెస్టు: దోపిడీ కేసులో పోలీసుల ఉదాసీనం

మరిన్ని వార్తలు