పాత కలెక్టర్‌పై కొత్త కలెక్టర్‌కు ఫిర్యాదు 

14 Mar, 2023 01:25 IST|Sakshi

జగిత్యాల: చేపట్టిన అభివృద్ధి పనికి బిల్లు చెల్లించలేదంటూ ఒక సర్పంచ్‌ పాత కలెక్టర్‌పై ప్రస్తుత కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట సర్పంచ్‌ తునికి నర్సయ్య కథనం ప్రకారం.. కలెక్టర్‌ రవి జగిత్యాల జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో దమ్మయ్యపేటలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.

బడికి ప్రహరీ నిర్మించాలని ఆ సమయంలో సర్పంచ్‌కు సూచించి.. బిల్లులు సైతం వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే 150 మీటర్ల పొడవుతో సర్పంచ్‌ గోడ నిర్మించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బిల్లు లు విడుదల కాలేదు. ఈలోగా కలెక్టర్‌ రవి బదిలీపై వేరే జిల్లాకు వెళ్లిపోయారు. దీంతో ప్రహరీ నిర్మాణ బిల్లులు ఇంకా తనకు రాలే దని సర్పంచ్‌ నర్సయ్య సోమవారం ప్రజావాణిలో అప్పటి కలెక్టర్‌ రవిపై ప్రస్తుత కలెక్టర్‌ యాస్మిన్‌ బాషాకు ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు