శ్వేతా రెడ్డి కుటుంబానికి న్యాయం జ‌రగాలి..

4 Sep, 2020 20:27 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని  చార్మినార్‌ డివిజన్‌ మేహిదీపట్నం సిటివో సర్కిల్‌–2 లో ఏసిటీవోగా విధులు నిర్వహిస్తున్న శ్వేతా రెడ్డి మృతి పై సమగ్ర విచారణ జరిపించాల‌ని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్‌ గేజిటేడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. గ్రూప్ 2 అధికారిని శ్వేతా రెడ్డి మృతికి ‌ కారణమైన కార్పోరేట్‌ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ తోటి ఉద్యోగిని కోల్పోవడం చాలా బాధాకరం విషయం అని అన్నారు. కాన్పు కోసం అని శ్వేతా రెడ్డి భర్త హైదరాబాద్‌లోని కార్పోరేట్‌ ఆసుపత్రికి తీసుకొని వెళ్ల‌గా అక్క‌డ త‌న‌కు మగ బిడ్డ పుట్టినట్లు వైద్యులు చెప్పిన‌ట్లు తెలిపారు. నాలుగు రోజుల తర్వాత ఆయాసం రావడంతో కరోనా పరీక్షలు జరిపి ఫలితాలు చూపకుండానే బాధితురాలికి కరోనా పాజిటివ్‌ అని చెప్పి లక్షలలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. (కోవిడే మన కొంప ముంచిందా?! ) 

20 రోజులు ఐసియూలో ఉంచి  సుమారు  29 లక్షలు వసూలు చేయటం హేయమైన చర్య అన్నారు. మృతురాలి భర్త మాధ‌వ‌రెడ్డి తన భార్యను చూస్తానని పట్టు బట్టడంతో చూపించారని, తన భార్య పరిస్థితి చూసి అనుమానంతో ఇతర వైద్యుల అభిప్రాయం తీసుకుంటాను రిపోర్టులు ఇవ్వమని గట్టిగా నిలదీయడంతో మరుసటి రోజు గుండెపోటుతో చనిపోయినట్లు ప్రకటించారన్నారు. శ్వేతా రెడ్డి  మృతి పై సమగ్ర విచారణ జరిపించి ,కారణమైన కార్పోరేట్‌ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని  కోరారు. అయితే  శ్వేతారెడ్డి మరణానికి  ప్రైవేటు ఆస్ప‌త్రి కార‌ణం అయి ఉంటుంద‌ని మ‌హ్మ‌ద్ మ‌జాహిద్ హుస్సేన్ ఆరోపించారు. (ఏడేళ్ల క్రితం స్పెర్మ్‌తో పండంటి బిడ్డ)

‘శ్వేతారెడ్డి ఎలా మ‌ర‌ణించిందో చెప్పమంటే చెప్ప‌కుండా దాటేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా తెలియ‌డంతో ఆస్ప‌త్రి యాజ‌మాన్యం బేర‌సారాలకు దిగింది. సిజేరియన్ ఆపై కరోనా అని చెప్పి 29 లక్షలు దోపిడీ చేసి గుండెపోటుగా చిత్రించడం ఎంత దారుణమో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ప్రశ్నించాలి. గ్రూప్ 2 అధికారిని శ్వేతారెడ్డి కుటుంబాన్ని దారుణంగా దోచుకుని మరణానికి కారణమైన ప్రైవేటు యజామాన్యం ఇంతకు ముందు నుంచి ఇదే వ్యాపార ధోరణీతో వేలాదిమంది పేద ప్రజలకు తప్పుడు రోగాలు అంటగట్టి లక్షలు దోచుకుంటున్నదని ప్రజలు ఎంత గగ్గోలుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు.ఇటీవల కరోనా కారణంగా ఇదే ఆస్ప్రత్రిపై వేలాది పిర్యాదులు ఇటు రాష్ట్రప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన కూడా కేవలం కేంద్రం స్పందించి నోటీసులు ఇచ్చింది. అయిన యాజమాన్యంలో మార్పు రాలేదు కదా ఇంకా దారుణంగా దోచుకుంటున్నది. (రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు)

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రజల పిర్యాదులతో డెక్కన్ హాస్పిటల్స్, విరించి హాస్పిటల్స్ చర్యలు తీసుకున్నది కానీ అంతకన్నా ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ఆ ఆస్ప‌త్రిపై ఎందుకు చర్యలు తీసుకోవ‌డం లేదు. ఒక గ్రూప్ 2 అధికారినినే ఇంత దారుణంగా మోసం చేస్తే చదువుకొని కుటుంబాలకు ఎంత దోచుకుంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి? ఇంకా ఆలోచిస్తే అసలు యశోదాలో ఏం జరుగుతుందో కేంద్ర స్థాయి దర్యాప్తు జరుపాల్సిన అవసరం ఉంది. ఏమైనా బహుళజాతి ఫార్మా కంపెనీల ప్రయోజనం కోసం ఏమైనా ప్రయోగాలు చేస్తున్నారా? ఎందుకు యశోధ హస్పిటల్స్ లోనే ఏళ్ల తరబడి ఈ విధంగా జరుగుతుంది. వెంటనే రాష్ట్ర ప్రజల బాగుకోసం తెలంగాణ ప్రభుత్వం యశోధ హాస్పిటల్స్ ని నిషేధించి యాజమాన్యం ఆస్తులను స్వాధీనం చేసుకోని దర్యాప్తు జరపాలి.’  అని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు