రెవెన్యూ తిప్పలు

23 Oct, 2020 01:30 IST|Sakshi

అంతా గందరగోళం.. గజిబిజి

అమల్లోకి రాకుండానే ఇబ్బంది పెడుతున్న కొత్త చట్టం

సాదాబైనామాలకు పాత చట్టం.. ఆర్డర్లకు మాత్రం కొత్తది

ప్రభుత్వ తీరును అనుకూలంగా మార్చుకుంటున్న యంత్రాంగం

నచ్చని పనులకు కొత్త చట్టాన్ని సాకుగా చూపి తప్పించుకుంటున్న వైనం

కొత్త రెవెన్యూ చట్టం మార్గదర్శకాలతోనే ఈ సమస్యకు పరిష్కారం: నిపుణులు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. అవినీతిరహిత, పారదర్శక రెవెన్యూ లావాదేవీల కోసం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సర్కారు.. ఇప్పటి వరకు దాని అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయకపోవ డంతో అధికారుల ముందరి కాళ్లకు బంధం పడినట్టయింది. కొన్ని నిర్ణ యాల అమలుకు పాత చట్టాన్నే పరిగణ నలోకి తీసుకోవాలని చెబుతున్న ప్రభు త్వం.. మరికొన్నింటికి మాత్రం గత నెలలో ఆమోదముద్ర వేసిన భూ హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం–2020(ఆర్వోఆర్‌) ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేస్తోంది.

విధానపర నిర్ణయాల అమల్లో భాగంగా ఏకకాలంలో వేర్వేరు చట్టాలను అమలు చేయాలని భూ పరిపాలన శాఖ స్పష్టం చేస్తుండటం క్షేత్రస్థాయి అధికా రులను ఇరకాటంలో పడేస్తోంది. ఆర్వోఆర్‌ చట్టం–1971 స్థానంలో కొత్త చట్టానికి గత నెల 9న శాసనసభ ఆమోద ముద్ర వేసింది. అయితే కొత్త చట్టం మేరకు అధికారాలు, విధులు, బాధ్యతలపై ప్రభుత్వం ఇప్పటివరకు నియమావళి (రూల్స్‌)ని జారీ చేయలేదు.

సాదాబైనామాలపై స్పష్టత ఏదీ? సాదాబైనామాల క్రమబద్ధీకరణకు పాత చట్టం ప్రకారమే నడుచుకోవాలని ప్రభు త్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం అధికారులను.. దరఖాస్తు దారులను అయోమయంలో పడేసింది. ప్రస్తుతానికి పాత చట్టమే మనుగడలో ఉన్నా.. కొత్త చట్టం అమలుపై నేడో, రేపో విధివిధా నాలు ఖరారైతే ఏ చట్టం ప్రకారం ముందుకెళ్లాలనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణను తిరస్కరిస్తే ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు సెక్షన్‌–5 (బీ) మేరకు అప్పీల్‌ చేసుకొనే వెసు లుబాటు అర్జీదారులకు ఉంటుంది.

అయితే కొత్త రెవెన్యూ చట్టంలో  తహసీల్దార్, ఆర్డీవో, ఏసీల అధికారాలకు ప్రభుత్వం కోత పెట్టింది. రెవెన్యూ కోర్టులనూ రద్దు చేసింది. దీంతో సాదాబై నామాల అప్పీళ్లను విచారించే అవకాశం లేదు. ఎలాం టి వివాదమైనా సివిల్‌ కోర్టులను ఆశ్ర యించాల్సి ఉంటుంది. కొత్త యాక్ట్‌పై రూల్స్‌ వెల్లడించే వరకు పాత చట్టమే అమల్లో ఉం టుంది కనుక అధికారులు అభ్యంతరాలను ఎలా పరిష్కారిస్తారనే విషయమై స్పష్టత కొర వడింది. పాత చట్టం ప్రకారం ఒకవేళ వారు ఉత్తర్వులిచ్చినా కొత్త చట్టానికి అనుగుణంగా సవరణలతో ఉత్తర్వులు ఇవ్వకుండా పాత చట్టం మేరకు నడుచుకోవాలని అనడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు.

విధివిధానాల ఖరారులో జాప్యంతో రెవెన్యూ యంత్రాంగం డైలమాలో పడింది. పాత చట్టం ప్రకారం ముందుకెళ్లాలా లేక కొత్త చట్టం రూల్స్‌ వచ్చే వరకు వేచి చూడాలా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. సాదా బైనామాలకు మాత్రం పాత చట్టాన్ని వర్తిం పజేస్తూ జీవో విడుదల చేసిన భూ పరిపాలన శాఖ.. కొత్త చట్టంపై నియమావళి విడుదల చేసే వరకు ఎలాంటి నిర్ణయాలు (ఆర్డర్లు) వెల్లడించవద్దని ఆదేశించడం ఉన్నతా« దికారుల ద్వంద్వ విధానాలకు అద్దం పడుతోంది. ఆదాయ, కుల, నివాస ధ్రువ పత్రాల జారీ అధికారాలను స్థానిక సంస్థలకు బదలాయిస్తున్నట్లు కొత్త చట్టంలో పొందుపరిచారు. అయితే ఇప్పటికీ వాటిని తహసీళ్లలోనే జారీ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు అధికారాలను సంక్రమింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వనందున జారీ తాము చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అదే ఇతరత్రా వ్యవహారాలకు వచ్చే సరికి  కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ దాటవేస్తున్నారు.

దరఖాస్తులకు మోక్షం ఎలా?
కొత్త రెవెన్యూ చట్టం అంకురార్పణ జరిగిన మరుక్షణమే రెవెన్యూ కార్యాలయాల్లో పరిపాలనకు బ్రేక్‌ పడింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయ కూడదని ఆదేశాలివ్వడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రికార్డుల నిర్వహణ, కోర్టుల్లో వివాదాల పరిష్కారం, రెవెన్యూ కోర్టుల్లో సమస్యల పరిష్కారం, అర్జీల పరిశీల న, భూముల సర్వే సబ్‌డివిజన్‌ అర్జీలు పెం డింగ్‌లో పడ్డాయి. రెవెన్యూ కేసుల జోలికి వెళ్లకూడదని.. ఏ వివాదమైనా కోర్టుల్లోనే తేల్చుకోవాలని కొత్త చట్టంలో స్పష్టం చేయ డంతో అధికారులు తల పట్టుకుంటున్నారు.

38 (ఈ), లావణి, ఓఆర్‌సీ హక్కులను ధరణిలో ఎక్కించడానికి మార్గమేమిటో చెప్పకపోవడం... సవరణలకు అవ కాశం ఇవ్వక పోవడం ద్వారా ధరణిలో నమోౖ దెన తప్పుడు రికార్డులకే చట్టబద్ధత కల్పించడం సరికాదని రెవెన్యూ వర్గాలు అంటు న్నాయి. పైగా రెవెన్యూ కోర్టుల రద్దుతో సివిల్‌ కోర్టులకు వెళ్లాలన్నా.. కరోనా కారణంగా ప్రధాన కేసులు మినహా ఇతర కేసుల విచారణను కోర్టులు చేపట్టడం లేదని, కొత్త చట్టంపై స్పష్టమైన మార్గదర్శకాలు త్వరగా జారీ చేస్తే తప్ప ఈ సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు