‘దండోరా’... ద్విముఖ వ్యూహం!

17 Aug, 2021 01:32 IST|Sakshi

దళిత ఎజెండా, పార్టీ శ్రేణులను కదిలించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కార్యక్రమం

రావిర్యాల సభకు మాణిక్యం, వరంగల్‌ సభకు రాహుల్‌!

సాక్షి, హైదరాబాద్‌: దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని ద్విముఖ వ్యూహం తో ముందుకు తీసుకెళ్లాలని టీపీసీసీ భావిస్తోంది. ఓవైపు సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళితబంధును కౌంటర్‌ చేస్తూనే మరోవైపు పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులను కదిలించేం దుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవా లని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంద్రవెల్లి తరహా సభలను నిర్వహించనున్నారు.

రాష్ట్రం లోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 16 చోట్ల ఈ సభలు నిర్వహించాలని, హైదరాబాద్, సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానాలకు కలిపి నగ రంలో ఒకేచోట సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. వచ్చే నెల 17 వరకు ‘దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా’కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ సభలతోపాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఇంటి ముందు చావుడప్పు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నిరసనల ద్వారా కేడర్‌లో ఊపు తేవాలనేది కాంగ్రెస్‌ ఆలోచనగా కనిపిస్తోంది. 

వరుసగా సభలు.. వరంగల్‌కు ప్రత్యేకత 
ఈ నెల 18న రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో, 24న సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌ లో టీపీసీసీ సభలు నిర్వహించనుంది. ఆ తర్వాత  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా ఉన్న నల్లగొండ లోక్‌సభ పరిధిలోని మిర్యాలగూడలో దళిత గిరిజన దం డోరా సభ ఏర్పాటు చేయనున్నారు. రావిర్యాల సభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ రానుండగా వరంగల్‌ లోక్‌సభ పరిధిలో నిర్వహించే సభకు రాహుల్‌ గాంధీని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దండోరా నిర్వహించడం ద్వారా రెండు రకాల ప్రయోజనాలుంటాయని కాంగ్రెస్‌ భావిస్తోంది.  దళిత బం ధును కౌంటర్‌ చేయడం, గత ఏడున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ చేపట్టిన దళిత, గిరిజన వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్గాలకు ఏం చేసిందన్న విషయాలను చెప్పడమే ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.   

మరిన్ని వార్తలు