కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది

16 Nov, 2023 08:49 IST|Sakshi

నాగార్జునసాగర్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ధీమావ్యక్తం చేశారు. పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలతో పాటు ఎమ్మార్పీఎస్‌ ఉపకులాల రాష్ట్రనాయకుడు విష్ణుమూర్తి బుధవారం జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో టీఎమ్మార్పీస్‌ చిత్రం శ్యాం ఉండగా కార్యక్రమంలో నాయకులు జంగయ్య, ఉంగరాల శ్రీను, ఆదాసు విక్రం,మందకిషోర్, పగిడి నర్సింహ, శ్రీను తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు