కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరిపించండి

23 Aug, 2022 04:44 IST|Sakshi

పదేపదే చెప్పిన మాటలే చెప్పకుండా చేతల్లో చూపెట్టాలి

టీఆర్‌ఎస్‌–బీజేపీలది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ

కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్, భట్టి, యాష్కీ, మహేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు చేయడం బీజేపీకి కొత్తేమీ కాదని, ఆయన అవినీతిపై విచారణ జరుపుతారో లేదో హోంమంత్రి అమిత్‌షా తేల్చి చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని మునుగోడు సభలో అమిత్‌షా చెప్పింది పాత చింతకాయ పచ్చడే. పదేపదే అవే మాటలు చెప్పడం కాదు.. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ ఎందుకు జరిపించడం లేదో అమిత్‌షా చెప్పాలి’అని కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమ్‌గా ఉన్నందుకే చర్యలు తీసుకోవడం లేదా? అని సోమవారం వారు ఒక సంయుక్త ప్రకటనలో ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు అమిత్‌షానే కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ ఎస్‌–బీజేపీలది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నది ప్రజ లందరికీ అర్థమవుతోందని పేర్కొన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి సామాన్యుడి బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామన్న హామీలు ఎక్కడికి పోయా యని ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్ర విభజన చట్టంలోని హామీలనూ అమలు చేయకుండా బీజేపీ, తెలంగాణ ప్ర జానీకాన్ని మోసం చేసిందని విమర్శించారు.  పసుపు బోర్డు ఏర్పాటును కాగితాలకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడం ద్వారా ఎన్నికల్లో గెల వచ్చని అమిత్‌షా భావిస్తున్నారని, అందుకే మునుగోడు సభలో సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క ప్రక టనా చేయలేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు.  

     

మరిన్ని వార్తలు