హ‌రీష్‌రావుకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది

13 Oct, 2020 17:13 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు హ‌డావిడిగా పెట్టార‌ని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అధికార ప‌క్షం త‌మ‌కు న‌చ్చిన బిల్లుల‌ను ఆమోదం చేసుకున్నార‌ని తెలిపారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ఉన్న అనుమానాల‌ను నివృతి చేయ‌నేల‌ద‌ని, వెబ్‌సైట్‌లో చాలా త‌ప్పులున్న‌య‌ని భ‌ట్టి వ్యాఖ్యానించారు. ఒక‌రి  భూమిని మరోకరు ధరణి వెబ్ సైట్‌లో ఎంట్రీ చేసుకుంటే అసలైన పట్టాదారు తన  భూమిని ఏంట్రీ చేయించాలంటే  ధరణి వెబ్ సైట్ లోకి తీసుకోవ‌ట్లేద‌న్నారు. ధ‌ర‌ణి వెబ్‌సైట్‌లోని త‌ప్పుల‌ను స‌రిచేకుండా ప్ర‌భుత్వం మ‌ళ్లీ త‌ప్పులు చేస్తోంద‌ని దీంతో  రైతులు గంధరగోళానికి గుర‌వుతున్నార‌ని పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో సాంప్ర‌దాయాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ప్ర‌తిప‌క్షాలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కూడా చెప్ప‌లేక‌పోతున్న‌ర‌ని మండిపడ్డారు. హ‌రీష్ రావుకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని అందుకే అసెంబ్లీకి రాకుండా దుబ్బాక‌లోనే మ‌కాం వేశార‌ని ఆరోపించారు. (జీహెచ్‌ఎంసీ సహా 4 బిల్లులకు శాసన సభ ఆమోదం)

క‌విత కోస‌మే మండ‌లి స‌మావేశాలు 
అసెంబ్లీ స‌మావేశాలు కేవ‌లం బిల్లుల ఆమోదం కోస‌మే అన్న‌ట్లు ఉంద‌ని ములుగు ఎమ్మెల్యే సీత‌క్క అన్నారు. క‌విత ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకే రేపు మండ‌లి పెడుతున్నార‌ని ఆరోపించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఎక్క‌డా పెన్ష‌న్లు పంపిణీ చేయ‌కుండా ఒక్క దుబ్బాక‌లోనే ప్ర‌భుత్వం ఎలా అప్రూవ్ చేస్తుంద‌ని ప్ర‌శ్నించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం వాళ్ళకు ధైర్యం నింపే పనికూడా ప్రభుత్వం చేయట్లేదని తెలిపారు. పదే పదే 50శాతం రిజర్వేషన్లు అని చెప్తున్న కేటీఆర్. మీ మొదటి ప్రభుత్వంలో ఓక్క మహిళా మంత్రి కూడా లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ర్టంలో మహిళా కమీషన్ లేదని దాని గురించి మాట్లాడండ‌ని హిత‌వు ప‌లికారు. పర్యావరణ అనుమతులు మీకు నచ్చిన వారికి ఓకలా నచ్చిని వారికి మరోలా ఉండొద్దని పేర్కొన్నారు. మొక్కలు పెంపకం కోసం వచ్చే కంపా నిధులు ఏమవుతున్నాయని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. 

హాడావిడిగా జీహెచ్ఎంసీ బిల్లు తేవాల్సిన ప‌నేంటి?
తెలంగాణలో  ప‌రిపాల‌న చాలా విచిత్రంగా ఉంద‌ని ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అన్నారు. రాత్రి క‌ల వ‌స్తే పొద్దున స‌భ పెడుతున్నారంటూ విమర్శించారు. స‌భ్యుల‌కు ఎజెండా తెలియ‌ద‌ని, చిన్న‌పిల్ల‌లు స్కూలుకు వ‌చ్చిన‌ట్లు స‌భ ఉంద‌న్నారు. క్లాస్‌లో పిల్ల‌లు పాఠాలు విన్న‌ట్లు అధికార‌ప‌క్షాం చెప్పేది మేం వినాల్సి వ‌స్తోందన్నారు.  భారీ వ‌ర్షాలు ప‌డుతున్నా దానిపై చ‌ర్చించాల్సింది పోయి  స‌భ‌ను వాయిదా వేయ‌డం ఏంట‌ని ,ఇంత హాడావిడిగా జీహెచ్ఎంసీ బిల్లుతో ప‌నేంట‌ని ప్ర‌శ్నించారు. 70వేల కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి పెట్టామంటే న‌మ్మేలా ఉందా అని అడిగారు. ధ‌రణి పోర్ట‌ల్‌పై చాలా అనుమాలున్నాయ‌ని , తెలిపారు. దుబ్బాక‌లో కాంగ్రెస్‌కు  సపోర్ట్ చేసే వారిని  పోలీసులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. (దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్‌కా సవాల్‌!)


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు