పరీక్షలు వాయిదావేయాలని .. ఆమరణ నిరాహార దీక్ష

27 Aug, 2020 19:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు. గాంధీభవన్లో ఎన్‌ఎస్‌యూఐ చేపట్టిన దీక్షాస్థలిని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. (నీట్‌-జేఈఈ వివాదం : అన్ని జాగ్రత్తలతో పరీక్షలు)

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో పరీక్షలు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యార్థుల కోసం ఎన్‌ఎస్‌యూఐ నిరాహార దీక్ష చేస్తుందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌, జేఈఈని పోస్ట్ పోన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. విద్యార్థుల జీవితాలతో దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న టైంలో పరీక్షలు పోస్ట్ ఫోన్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయ్యకార్ భవన్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

మరిన్ని వార్తలు