ఎస్‌ఐ చెబితే పంపాలా?.. కానిస్టేబుల్‌ దురుసు ప్రవర్తన

27 Jul, 2021 08:18 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్‌): వేములవాడ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే మహేందర్‌ మంత్రి కేటీఆర్‌ పర్యటన బందోబస్తులో భాగంగా సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విధులకు వచ్చారు. మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో సమావేశం జరుగుతుండగా ముస్తాబాద్‌ జెడ్పీటీసీ శరత్‌రావు కారులో ఆ సమావేశానికి వచ్చారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఆస్పత్రికి వెళ్లడానికి వీలులేదని తెలిపారు. తాను ప్రజాప్రతినిధినని సమావేశానికి వెళ్లాల్సిన అవసరం ఉందని అక్కడే విధుల్లో ఉన్న సిరిసిల్ల టౌన్‌ ఎస్‌ఐ అపూర్వరెడ్డికి జెడ్పీటీసీ తెలిపారు. 

వెంటనే కారును లోనికి పంపించాలని ఎస్‌ఐ తెలుపగా నేను మీరు చెబితే వినాల్సిన అవసరం లేదని వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా కోవిడ్‌ నిబంధనలను బేఖాతర్‌ చేస్తున్నారు కాస్త మాస్కు ధరించడని చెబితే నా ఇష్టం అనే రీతిలో మాటలు వదిలిపెట్టారు. అక్కడనున్న స్థానికులు మిగతా పోలీసులు కలుగచేసుకుని కానిస్టేబుల్‌ విధానం సరికాదని తెలిపి గొడవ సద్దుమణిగేలా చేసి ప్రజాప్రతినిధిని సమావేశానికి అనుమతించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు