భద్రాద్రి రామయ్య కల్యాణంపై వివాదం

9 Apr, 2022 02:34 IST|Sakshi

హైకోర్టులో రిట్‌ దాఖలు 

సాక్షి, హైదరాబాద్‌: పురాతన సంప్ర దాయాలు, అల వాట్లకు భిన్నంగా కొత్త విధానాలను శ్రీరామ కల్యా ణంలో అమలు చేస్తున్నారంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. స్వామి వారి కల్యాణంలో శ్రీరామచంద్రప్రభు అనడానికి బదులుగా శ్రీరామనారాయణ అంటున్నారని, పలు సంప్రదాయాలకు విరుద్ధంగా కల్యాణం నిర్వహిస్తుంటే ప్రధాన అర్చకుడు అడ్డుకోవడం లేదని రిట్‌లో పేర్కొన్నారు.

ఈమేరకు హైదరాబాద్‌కు చెందిన వెంకటరమణ దాఖలు చేసిన రిట్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి శుక్రవారం విచారించారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమన్నారు. ఆలయ అధికారుల వాదనల తర్వాతే ఉత్తర్వుల విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేశారు. .

మరిన్ని వార్తలు