బేగంబజార్‌కు కరోనా ఎఫెక్ట్.. 100 మందికి పైగా!

8 Apr, 2021 11:43 IST|Sakshi

సాక్షి, అబిడ్స్‌(హైదరాబాద్‌): బేగంబజార్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. బేగంబజార్‌లో 100 మందికిపైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అ‍య్యింది. దీంతో రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌కు కరోనా ఎఫెక్ట్‌ పడింది. పలువురు వ్యాపారస్తులకు కరోనా రావడం, మార్కెట్లో విపరీతమైన రద్దీ ఉండడంతో బేగంబజార్‌లో ఈ నెల 9వ తేదీ నుంచి దుకాణాల వేళలను మార్చారు. శుక్రవారం నుంచి ఉదయం 9 గంటలకు దుకాణాలు తెరిచి సాయంత్రం 5 గంటల వరకే మూసివేస్తామని ది హైదరాబాద్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్‌ అగర్వాల్‌లు తెలిపారు.

బేగంబజార్, ఛత్రి, ఫిష్‌ మార్కెట్, మిట్టికా షేర్‌ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్‌ కిరాణ దుకాణాలన్నీ తమ అసోసియేషన్‌ నిబంధనలు పాటిస్తాయన్నారు. ప్రతి దుకాణం వద్ద కొనుగోలుదారులు, వ్యాపారస్తులు మాస్క్‌లు ధరించేలా, శానిటైజర్‌ వాడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు. 

మరిన్ని వార్తలు