మొహర్రంకు ‘కోవిడ్‌’ షరతులు

22 Aug, 2020 03:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏటా అట్టహాసంగా జరిగే వినాయక చవితి వేడుకలకు ఈసారి కరోనా మహ మ్మారి అడ్డుపడింది. దీంతో ఈసారి కరోనా నిబంధనలకు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం, సూచించింది. వాడవాడలా వెలిసే గణేశ్‌ మండపాలకు పోలీసులు ఈసారి అనుమతి ఇవ్వలేదు. అయితే అపార్ట్‌మెంట్లు, టౌన్‌షిప్పులు, ఆలయాలకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. అక్కడ కూడా విగ్రహాలు మూడు అడుగులకు మించకూడదంటూ స్పష్టమైన ఆంక్షలు విధించారు. కరోనా కేసులు గ్రామాల్లో కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా మండపాల్లో ఎలాంటి డీజేలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. (ఖైరతాబాద్‌ గణనాథునికి 100 కేజీల లడ్డూ)

మొహర్రంకు ‘కోవిడ్‌’ షరతులు
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ నేపథ్యంలో మొహర్రంను జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. మొహర్రంలో భాగంగా ఈ నెల 21 నుంచి 31 వరకు పాటించే సంతాప దినాలను జాగ్రత్తగా నిర్వహించాలని, ఆచారాల నిర్వహణకు ముతవల్లీలు, ముజావర్లు, మేనేజింగ్‌ కమిటీలను అనుమతించాలని కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సీఈవో లేఖ రాశారు. పీర్ల చావిడ్ల వద్ద భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ఆలంల ఏర్పాటు, అగ్ని గుండాలను అనుమతించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇచ్చే షర్బత్‌ లేదా ఉచిత మంచినీటి పంపిణీకి సీల్డ్‌ ప్యాకెట్లలో మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. 

మరిన్ని వార్తలు