Coronavirus: 500 డోసుల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మాయం

22 May, 2021 09:03 IST|Sakshi
కొండాపూర్‌లోని వ్యాక్సినేషన్‌ సెంటర్‌ ఇదే (ఫైల్‌)  

సాక్షి, గచ్చిబౌలి: కరోనా టీకాల్లేక జనం ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఉన్న టీకాలకు సరైన భద్రతలేక దొంగలపాలవుతున్నాయి. హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో 500 డోసుల కోవాగ్జిన్‌ వాక్సిన్‌ బాక్స్‌ మయమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిలోని డెలివరీ వార్డులో గల ఓ గదిలో వ్యాక్సిన్లను భద్రపరిచా రు. ఇటీవల ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు విరా మం ప్రకటించడంతో మిగిలిన వ్యాక్సిన్లను అదే గదిలో ఉంచారు. బుధవారం ఆ గదిని తెరిచి చూడగా కొవాగ్జిన్‌ 50 వయల్స్‌(500 డోసులు) గల బాక్స్‌ కనిపించలేదు.

దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పోలీసులకు ఫిర్యా దు చేయగా.. దర్యాప్తు చేపట్టారు. ఆ గది ఇన్‌చార్జి డాక్టర్‌ మహేశ్‌కు కోవిడ్‌ రావడంతో  తాళాలను మణి అనే వ్యక్తికి అప్పజెప్పారు. ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఓ వార్డ్‌బాయ్‌ వ్యాక్సిన్‌ ఉన్న గది వైపు వెళ్లినట్లు రికార్డు అయింది. అతను రెండు రోజులుగా ఆస్పత్రికి రావడం లేదని సమాచారం. గతంలోనూ ఓ వ్యక్తి వ్యాక్సిన్‌ దొంగిలించినట్లు తెలుస్తోంది. ఇంటిదొంగలే అదను చూసి వ్యాక్సిన్‌ మాయం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
చదవండి: Coronavirus: ‘లాంగ్‌ కోవిడ్‌..’ లైట్‌ తీస్కోవద్దు!

మరిన్ని వార్తలు