మానవత్వం బ్రతికే ఉందని తెలిపే కథ

22 Apr, 2021 16:41 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా బంధాలు, బంధుత్వాలు సన్నగిల్లుతున్నాయి. రోగం పేరిట అయిన వారిని దూరం పెడుతున్న వారు ఈ సమాజంలో కోకొల్లలు. కానీ, ఎక్కడో.. ఏదో చోట తోటి వారి కోసం తోడుగా నిలిచే వారు లేకపోలేదు. ఎదుటి వారి ప్రాణాల కోసం తమ ప్రాణాలు అడ్డుగా పెట్టి శ్రమిస్తున్న వారూ లేకపోలేదు. మానవత్వం బ్రతికే ఉందని తెలిపే కథ. మనిషికి మనిషే తోడని తెలిపే.. నా జీవితంలో జరిగిన యధార్థ కథ. మీ కోసం....

రెండు రోజుల క్రితం, రాత్రి 10 గంటల సమయంలో కెనడాలోని నా ఫ్రెండ్‌నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. తన చెల్లెలుకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, దాదాపు ఐదు గంటలుగా అంబులెన్స్‌లోనే ఉందని, ఆమెకు ఏదైనా ఆసుపత్రిలో బెడ్‌ ఇప్పించమని ఆమె కోరింది. నేను స్కూల్లో నా సీనియర్‌ అయిన డా. ప్రదీప్‌ రెడ్డికి ఫోన్‌ చేశాను. ఏదైనా సహాయం చేయమని అడిగాను. ఆయన తన ఆసుపత్రికి తీసుకు వెళ్లమని చెప్పాడు. వెంటనే అక్కడికి తీసుకెళ్లాము. డాక్టర్‌ సురేష్‌ మా కోసం అక్కడ ఎదురుచూస్తూ ఉన్నారు. ఆమె ఆరోగ్యపరిస్థితి బాగా క్షీణించింది. శరీరంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ బాగా తగ్గిపోయాయి. డాక్టర్‌ సురేష్‌ నన్ను పిలిచి ఆమె పరిస్థితి వివరించారు. ఆమెను మామూలు స్థితికి తీసుకురావటానికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు.

ఆమె ప్రాణాల కోసం పోరాడుతోంది. ఊపిరితిత్తులు బాగా పాడయ్యాయి. అయినప్పటికి ప్రాణాలు నిలుపుకోవటానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిరోజూ డా.ప్రదీప్‌ రెడ్డి, డా. సురేష్‌ రెడ్డి, డా.కిషన్‌, డా. మోనిక తదితరులు తమ శక్తి వంచనలేకుండా ఆమెను రక్షించటానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె కథలో భాగమైన.. తెలిసిన, తెలియనివాళ్లు ఎంతో మంది ఆమెను రక్షించటానికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిస్తే తను చాలా సంతోషిస్తుంది.

ఇది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయం.. మనమందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తూ.. మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తేనే బతకగలం.
- మీ కవిత.. 

మీకు తెలిసిన పాజిటివ్‌ స్టోరీని nri@sakshi.com కు పంపండి.. అందరి గుండెల్లో ధైర్యాన్ని నింపండి.

మరిన్ని వార్తలు