గత 24 గంటల్లో 1417 కరోనా కేసులు

18 Jun, 2021 19:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కొత్త కేసుల విషయంలో స్పల్పంగా తగ్గుముఖం కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,417 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. గురువారం రోజు 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పాయారు. నిన్న ఒక్కరోజే 1,897 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,10,834కు చేరింది. మరణాల సంఖ్య 3546 గా ఉంది. ఇప్పటి వరకు 5,88,259 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,24,430 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తంగా 1,73,14,780 పరీక్షలు పూర్తి చేశారు

చదవండి: ఆగని కరోనా ఉధృతి .. ఆ జిల్లాలో వందల కొద్ది కేసులు..

మరిన్ని వార్తలు