TS: రేపటి నుంచి ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సినేషన్‌

29 May, 2021 12:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం వందల మంది​ ప్రయాణికుల మధ్య  తిరిగే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా రేపు(ఆదివారం) రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో సుమారు 50వేల మంది డ్రైవర్లు, కండక్టర్లకు టీకాలు వేయనున్నారు.

ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను భారీ స్థాయిలో చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది సూపర్‌ స్ప్రెడర్స్‌ ఉంటారని అంచనా వేసిన ప్రభుత్వం తొలి దశలో 7.75 లక్షల మందికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 లక్షల మంది సూపర్‌ స్ప్రెడర్స్‌ ఉంటే, అందులో 3 లక్షల మంది ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు ఉన్నారు. అయితే సూపర్‌ స్ప్రెడర్స్‌ అయిన ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.
చదవండి: కరోనా బాధితురాలికి ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సాయం

మరిన్ని వార్తలు