కరోనా : తెలంగాణలో కొత్తగా 1,764 కేసులు

29 Jul, 2020 11:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. రాష్ట్రంలో  కొత్తగా 1,764 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 58,908కి చేరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.  గత 24 గంటల్లో 18,858 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనాతో మంగళవారం ఒక్క రోజే 12 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 492కి చేరింది.
(చదవండి : మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా)

కొత్తగా వచ్చిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 509 ఉన్నాయి. మేడ్చల్‌లో 158,నల్లగొండ51, నిజామాబాద్‌47,మహబూబ్‌నగర్‌47,పెద్దపల్లి44, వరంగల్‌ రూరల్‌ 41, సూర్యాపేట 38, రంగారెడ్డి147, వరంగల్‌ అర్బన్‌ 138, కరీంనగర్‌ 93, సంగారెడ్డి89, ఖమ్మం జిల్లాలో 69 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,751 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 14,663 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (చదవండి : కరోనా: రెండున్నర నెలల్లో ఇదే అత్యధికం)

మరిన్ని వార్తలు