తెలంగాణ : తొలిసారి 2 వేలకు పైగా కరోనా కేసులు

1 Aug, 2020 10:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తొలిసారి ఒక్క రోజులో 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,083 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  64,786 కు చేరింది. ఈ మేరకు శనివారం ఉదయం తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. 
(చదవండి : 57 వేలకు పైగా కేసులు.. 36వేలు దాటిన మరణాలు)

గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 530కి చేరింది. తాజాగా వచ్చిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 578, రంగారెడ్డి 228, మేడ్చల్‌ 197, వరంగల్‌ అర్బన్‌134, సంగారెడ్డిలో 101 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకొని తాజాగా 1,114 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 46,502 మంది కోలుకోగా, 17,754 మంది చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు