తెలంగాణలో 2,447 కొత్త కేసులు.. ముగ్గురి మృతి

17 Jan, 2022 20:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,447 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 1,112 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 235, రంగారెడ్డి జిల్లాలో 183 కేసులు నమోదయ్యాయి.

చదవండి:  సిలబస్‌ టెన్షన్‌.. బుర్రకెక్కింది అంతంతే

మరోవైపు 2,295 మంది కరోనా నుంచి కోలుకోని వివిధ ఆస్సత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌తో ముగ్గురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,060కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,11,656 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,85,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 22,197 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 

మరిన్ని వార్తలు