‘కార్పొరేట్‌’ దందా!

5 Sep, 2020 02:24 IST|Sakshi

స్పెషల్‌ ప్రాక్టీస్‌ కోసం ప్రత్యేకంగా పుస్తకాల ముద్రణ

రెండు పుస్తకాలకు రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు వసూలు

8, 9, 10 తరగతులకు తప్పనిసరి చేస్తూ విక్రయాలు

కరోనా వేళ కార్పొరేట్‌ పాఠశాలల దోపిడీ

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వర్షశ్రీ చైతన్యపురిలోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ప్రతిరోజు ఆన్‌ లైన్‌ క్లాస్‌లకు హాజరవుతోంది. రెండ్రోజుల క్రితం ఆన్‌ లైన్‌ క్లాస్‌ పూర్తయ్యే సమయంలో ‘స్కూల్‌లో మాడ్యూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో పుస్తకం రూ.1,500 డబ్బులు చెల్లించి వాటిని తీసుకొని ప్రాక్టీస్‌ చేసుకోవాలి’అని క్లాస్‌ టీచర్‌ సూచించారు. దీంతో మాడ్యూల్స్‌ కొనుగోలు చేసేందుకు వర్షశ్రీ తల్లిని ఒత్తిడి చేసి స్కూల్‌కు వెళ్లి మాడ్యూల్స్‌ కొనుగోలు చేసింది.

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వేళ ప్రైవేటు పాఠశాలలు సరికొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. కోవిడ్‌–19 కారణంగా పాఠశాలలు మూత బడటంతో విద్యార్థులకు ఆన్‌ లైన్‌ లో బోధన సాగిస్తున్న యాజమాన్యాలు.. ఇప్పుడు అభ్యసనా కార్యక్రమాల కింద ప్రత్యేకంగా మాడ్యూల్స్‌ రూపొందించి విక్ర యిస్తున్నాయి. వాస్తవా నికి పాఠ్య పుస్తకాల్లో ఉన్న అంశాలనే ఇందులో ప్రస్తావించినప్ప టికీ.. ముఖ్యమైన అంశాలను వరుసగా చేర్చి పుస్తక రూపంలో మాడ్యూల్స్‌ పేరిట తీసుకు వస్తున్నాయి. కొన్ని పాఠశాలలు ఒక్కో సబ్జె క్టుకు ఒక్కో మాడ్యూల్‌ను రూపొందిం చగా... మరికొన్ని పాఠశాలలు లాంగ్వేజెస్‌ ను ఒక పుస్తకంగా, మిగతా సబ్జెక్టులను మరో పుస్త కంగా తీసుకువచ్చాయి. వీటి ధర లను రూ.1,500–3,000 వరకు నిర్ధేశించి విద్యా ర్థులకు అంటగడుతున్నాయి.

హైస్కూల్‌ విద్యార్థులకే...
ప్రస్తుతం పాఠశాలల్లో ఎక్కువగా హైస్కూల్‌ పిల్లలకే ఈ మాడ్యూల్స్‌ రూపొందించాయి. 8, 9, 10 తరగతుల విద్యార్థుల సబ్జెక్టుల ఆధారంగా ఈ స్పెషల్‌ బుక్స్‌ను అందు బాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాలను పాఠశాల యాజమాన్యాలే ముద్రిస్తుండటంతో వారు నిర్ధేశించిన ధరలే అచ్చు రూపంలో వస్తున్నాయి. విద్యార్థులకు పాఠ్యాంశం అభ్యసన కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రాక్టీస్‌ మంచిదే అయినా.. ఇంతపెద్ద మొత్తంలో ధరలు నిర్ధేశించి దండుకోవడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. రూ.వంద కూడా వెలకట్టలేని పుస్తకాలపై వేల రూపాయలు డిమాండ్‌ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైౖ వేటు పాఠశాలలపై విద్యాశాఖ అజమాయిషీ కోల్పోతోందని, ఫలితంగా యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అన్నింటినీ వ్యాపార కోణంలో సాగిస్తున్నాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.  

మరిన్ని వార్తలు