Niloufer Cafe Hyderabad: కప్పు చాయ్‌ రూ.1000.. ఎక్కడంటే?

17 Oct, 2021 16:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా మనం ఒక కప్పు టీ కోసం మీరు ఎంత ఖర్చు పెడుతాం. రూ.15, 25 అంతే కదా లేదా ఖరీదైన హోటల్స్‌కి వెళితే 150 నుంచి 300 వరకు రేటు ఉంటుంది. కానీ అక్కడి హోటల్‌లో మాత్రం ఓ కప్పు టీ రూ.1,000 ఖరీదు ఉందట! అయినా ఈ రేటు విదేశాల్లో అనుకుంటే పొరపాటే. ఇది మన హైదరాబాద్‌లోని నిలోఫర్‌ కేఫ్‌లోని కప్పు టీ రేటు అంత ఉందంట. అసలు ఆ చాయ్‌ అంత ఖరీదు ఎందుకంటే..?

ఆ క‌ప్పు చాయ్‌కి అంత ధరకి కారణం.. ఆ టీ తయారీకి వాడే టీ పౌడ‌ర్ ధ‌ర కిలో రూ.75 వేలు ఉంది కాబట్టి. ఇందులో ప్రత్యేకతలు.. ఈ చాయ్‌లో పాలు ఉండ‌వు. దీన్ని తయారీ విధానం వేరుగా ఉంటుంది. ఈ చాయ్ మాల్టీ వాస‌న‌తో అద్భుతంగా ఉంటుంది. నిలోఫర్‌ కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈ టీ ని గోల్డెన్ టిప్స్ బ్లాక్‌ టీ అంటారు. మేము ఆ పౌడర్‌ని అస్సాంలోని మైజాన్‌లో నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసాము.

కేవలం 1.5 కిలోలు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, కేఫ్ ఈ టీ రకాన్ని అందించడం ఇదే మొదటిసారి కాదు. గత రెండేళ్లుగా సేవలందిస్తోంది. అసోంలోని మైజాన్ గోల్డెన్ టిప్స్, మాల్టీ వాసనకు ప్రసిద్ధి, దేశంలో అత్యంత ఖరీదైన టీ రకాల్లో ఇదీ ఒకటి. 2019 లో, ఇది గౌహతి టీ వేలం కేంద్రంలో కిలో రూ .70,000 కి విక్రయించి రికార్డు కూడా సృష్టించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, కోల్‌కతాలో ఒక టీ విక్రేత కూడా ఒక్కో కప్పుకు రూ .1,000 చొప్పున టీ అమ్మడం ప్రారంభించాడు.  ఈ రకం టీ దేశంలోనే అత్యంత ఖ‌రీదైన చాయ్‌గా కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ స్ఫెషల్‌ టీ మా బంజారాహిల్స్ అవుట్‌లెట్‌లో మాత్రమే లభిస్తుందని ఆయన అన్నారు.

చదవండి: Pune Woman Dont Want To Beg: ‘నాకు అడుక్కోవాలని లేదు.. పెన్నులు కొనండి చాలు’

మరిన్ని వార్తలు