పత్తి బంగారం.. క్వింటాకు రూ.9,100.. ఏ మార్కెట్‌లో అంటే?

31 Dec, 2021 12:19 IST|Sakshi

ఖమ్మం, మద్నూర్‌ మార్కెట్లలో రికార్డు ధరలు 

సాక్షి, ఖమ్మం వ్యవసాయం/మద్నూర్‌(జుక్కల్‌): ఖమ్మం, మద్నూరు మార్కెట్లలో గురువారం పత్తికి రికార్డు ధర పలికింది. ఖమ్మం వ్యవ సాయ మార్కెట్‌లో మంగళ, బుధవారాల్లో క్వింటా రూ.9 వేలుగా పలికిన ధర గురువారం రూ.9,100గా నమోదైంది. మోడల్‌ ధర రూ.9 వేలు, కనిష్ట ధర రూ.8వేలుగా నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మార్కెట్లో పత్తి క్వింటాకు రూ.9,050 ధర లభించింది.  
చదవండి: ప్లాట్‌.. పాస్‌‘బుక్కయ్యి’.. ధరణి రూటు మారుస్తున్న రియల్టర్లు  

మరిన్ని వార్తలు