సీఎం కేసీఆర్‌ ఇలాకాలో అవిశ్వాసం లొల్లి.. షాకిచ్చిన కౌన్సిలర్స్‌

10 Feb, 2023 08:57 IST|Sakshi

గజ్వేల్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలోని గజ్వేల్‌ –ప్రజ్ఞాపూర్‌ మున్సి పాలిటీలో అవిశ్వాసం లొల్లి మొదలైంది. ఒంటెత్తు పోకడలను ప్రదర్శిస్తు న్నాడని ఆరోపిస్తూ అధికార పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లలో 14 మంది మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళిపై తిరుగుబాటు జెండాను ఎగరేశారు. 

ఈ క్రమంలోనే వారంతా స్వయంగా సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానాన్ని గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌కు అందజేశారు. అనంతరం కౌన్సిలర్లు సంయుక్తంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ పాలనకు మచ్చ తెస్తున్నాడని ఆరోపించారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు