కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం

30 Apr, 2021 09:12 IST|Sakshi

దిల్‌సుఖ్‌నగర్‌: సేవయే తమ ధ్యేయమని ఆర్‌కేపురం డివిజన్‌ వాసవీ కాలనీలో నివాసం ఉండే తమ్మనాస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు తమ్మన శ్రీధర్, లక్ష్మి సుజాతలు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో కరోనా వచ్చిందని తెలిస్తే రోగుల బంధువుల కూడా దగ్గరికి రావడం లేదు. అలాంటిది కరోనా బాధితుల బాధను చూసి వారి ఆకలిని తీరుస్తున్నారు. అది కూడా ఉచితంగా అందిస్తున్నారు.

తమ్మనాస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కరోనా బారినపడి ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఆహారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భోజనం లేక ఇబ్బంది పడే వారికి లక్ష్మీ సుజాతే స్వయంగా వంట చేసి ఆహారం అందజేస్తున్నారు. ప్రసుత్తం ఆర్‌కేపురం వాసవి కాలనీలో 35 మంది బాధితులకు ఉచితంగా రోజుకు రెండు పూటలా భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు తమకు సెల్‌ 9441128021లో ఫోన్‌ చేసి వివరాలు తెలిపితే ఇంటికే భోజనం పంపిస్తామని పేర్కొన్నారు. 

( చదవండి: మాస్కే మంత్రం.. టీకానే దివ్య ఔషధం..! )

మరిన్ని వార్తలు