భైరి నరేష్‌కు రిమాండ్‌, వ్యాఖ్యలకు సపోర్ట్‌గా పోస్టులు.. రంగంలోకి పోలీసులు

31 Dec, 2022 15:30 IST|Sakshi
భైరి నరేష్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌/హన్మకొండ: అయ్యప్ప స్వామి, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓయూ విద్యార్థి భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భైరి నరేష్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ప్రకటించారు కూడా. ఈ తరుణంలో శనివారం మరో పరిణామం చోటు చేసుకుంది. భైరి నరేష్‌ను కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్‌ విధించింది న్యాయస్థానం. 

భైరి నరేష్‌ను, హనుమంత్‌లను పరిగి సబ్‌ జైలుకు తరలించారు పోలీసులు. ఈ సమాచారం అందుకున్న అయ్యప్ప స్వాములు జైలు ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు భైరి నరేష్‌ సమీప బంధువు మరో వివాదాస్పద చర్యకు దిగాడు. భైరి నరేష్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశాడు అగ్నితేజ్‌. దీంతో మరో దుమారం చెలరేగింది. 

అగ్నితేజ్‌ పోస్టుపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో రంగంలోకి దిగిన పోలీసులు.. అగ్నితేజ్‌ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని అగ్నితేజ్‌ గురించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే తమ కొడుకుతో తమకు మాటలు లేవని, తాము దేవుళ్లను పూజిస్తామని అగ్నితేజ్‌ తల్లి స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. మరోవైపు భైరి నరేష్‌ తల్లిదండ్రులు, భార్య సుజాత ఇద్దరు పిల్లలు భయంతో ఇల్లు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు