వామ్మో.. కొంపముంచిన సేవా కార్యక్రమం..

12 Apr, 2021 09:16 IST|Sakshi

సాక్షి, లంగర్‌హౌస్‌: లంగర్‌హౌస్‌లో ఓ సంఘం వారు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు శాపంగా మారాయి. నిర్వాహకులతో పాటు అక్కడికి వచ్చిన వారు కరోనా బారినపడ్డారు. గత కొన్ని రోజుల క్రితం గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు. కాగా లంగర్‌హౌస్‌కు చెందిన ఓ సంఘం వారు వీరికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు. ఇందులో వందలాది మంది అభ్యర్థులు భోజనాలు చేశారు.

కాగా వారం తరువాత సేవా కార్యక్రమాలు నిర్వహించిన పలువురి సుస్తి చేసింది. కాగా వీరిలో చాలా మంది గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. వీరిలో చాలా మంది వైద్యుల సలహాలతో మందులు తీసుకుని హోం క్వారంటైన్‌లో ఉండిపోయారు. కాగా ఈ సంఘటనలో పదుల సంఖ్యలో వైరస్‌ బారినపడ్డారని తెలిసింది.  

మరిన్ని వార్తలు