ఈ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువేనట

15 Apr, 2021 17:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చిగుళ్ల వ్యాధితో కరోనా వైరస్‌ త్వరగా శరీరంలోకి ప్రవేశిస్తుందని డాక్టర్‌ గౌడ్స్‌ డెంటల్‌ పరిశోధనా బృందం అధిపతి డాక్టర్‌ వికాస్‌గౌడ్‌ వెల్లడించారు. చిగుళ్లు చెడిపోయినప్పుడు వైరస్‌ సులువుగా ఊపిరితిత్తుల్లోకి లేదా నేరుగా రక్తంలోకి వెళ్తుందని తెలిపారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో గత కొన్నాళ్లుగా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ వివరాలు తెలిపారు. నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వల్ల, చిగుళ్ల వాపు ద్వారా వైరస్‌ తీవ్రతను పెంచుతాయని ఓ ప్రకటనలో వివరించారు.

చిగుళ్ల వద్ద ఉండే వాహకాలు (ఏసీఈ–2) వైరస్‌ను శరీరంలోకి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. మధుమేహం, విటమిన్‌–సి కొరత, కేన్సర్, పొగాకు, గుట్కా వినియోగించే వారికి చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయని, వీరికి మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుందని తెలిపారు. అందుకే 6 నెలలకో సారి వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలో దంతాలను శుభ్రం చేయించుకోవాలని సూచించారు. ఉబ్బిన చిగుళ్లతో వైరస్‌ లోడ్‌ పెరుగుతుందని, నోటి పరిశుభ్రతను పాటించడం ద్వారా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ రేటు తగ్గుతుందని వివరించారు.  
(చదవండి: తెలంగాణ మాజీ మంత్రి చందూలాల్‌ కన్నుమూత)

మరిన్ని వార్తలు