ఎంజీఎంలో విషాదం: నిర్లక్ష్యానికి ‘ఊపిరి ఆగింది’!

21 Mar, 2021 10:38 IST|Sakshi

సాక్షి,వరంగల్‌: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ కరోనా రోగి మృతి చెందాడు. కరెంట్‌ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్‌పై ఉన్న రోగి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. కరోనా బాధితుడు గాంధీ.. గత నెలాఖరులో ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే, శనివారం ఆస్పత్రిలో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది.

దీంతో వెంటిలేటర్‌ పనిచేయకపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై అతను ప్రాణాలు కోల్పోయాడు. కాగా, వెంటిలేటర్‌ తీసేసి సాధారణ బెడ్‌పై వేయడంతో గాంధీ ప్రాణాలు కోల్పోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంజీఎం సూపరింటెండెంట్‌ నాగార్జునరెడ్డి వివరణ ఇస్తూ... ఆస్పత్రిలో అందుబాటులో జనరేటర్లు ఉన్నాయని, మరో వెంటిలేటర్‌ మార్చే క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగానే కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు