మంచె మీదే ఐసోలేషన్‌.. పదిరోజులుగా చెట్టుమీదే 

15 May, 2021 13:21 IST|Sakshi

చెట్టు మీద గడుపుతున్న కరోనా బాధితుడు

రెండు ఇళ్లున్నా... బాత్రూంలోనే మరొకరు

అడవిదేవులపల్లి: కరోనా సోకిన ఓ యువకుడికి చెట్టు మీద ఏర్పాటు చేసుకున్న మంచే ఐసోలేషన్‌ కేంద్రమైంది. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్‌ శివ హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా గ్రామానికి వచ్చిన అతడు స్థానిక ఐకేపీ కేంద్రంలో హమాలీ పనులకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కరోనాకు గురయ్యాడు.

ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉండడం, అందరికీ ఒకటే గది కావడంతో కుటుంబ సభ్యులని ఇబ్బంది పెట్టకూడదని భావించాడు. ఇంటి ఆవరణలోనే ఉన్న ఓ చెట్టుపై మంచె ఏర్పాటు చేసుకుని, దానిపైనే నిద్రిస్తూ, సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ, వీడియోలు చూస్తూ గడుపుతున్నాడు. మంచె మీద సరదాగా గడిచిపోతోందని, భయం దరిచేరక పోతే కరోనాతో పోరాడవచ్చని శివ అంటున్నాడు. 

చదవండి: అమానుషం: నిండు గర్భిణీపైనా.. దయ చూపలేదు

మరిన్ని వార్తలు