తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. మరో 6 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స రద్దు

31 May, 2021 20:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొవిడ్ చికిత్సకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రుల‌పై వ‌స్తున్న ఫిర్యాదుల‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 105 ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో 16 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. వీటిలో 6 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు ప్రముఖ ఆస్పత్రులు ఉన్నాయి. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని పద్మజా హాస్పిటల్‌, ఉప్పల్‌లోని టీఎక్స్‌ ఆస్పత్రి, అల్వాల్‌లోని లైఫ్‌లైన్‌ ఆస్పత్రి, వరంగల్‌లోని మ్యాక్స్‌క్యూర్, లలిత ఆస్పత్రులు, సంగారెడ్డిలోని సాయిశ్రీరామ్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సను రద్దు చేశారు. 

మరిన్ని వార్తలు