జనం ఎక్కువ.. డోసులు తక్కువ 

20 Jul, 2021 09:53 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీ కేంద్రాలకు ప్రజలు కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవడానికి సోమవారం భారీగా తరలివచ్చారు. మొదటి డోసు, రెండో డోసు వేసుకోవడానికి ఉదయంనుంచే ఆయా కేంద్రాల వద్ద ప్రజలు క్యూలో నిల్చున్నారు.అయితే  టీకా వాయిల్స్‌ తక్కువగా సరఫరా ఉండడంతో అందరికీ టీకా వేయలేకపోయారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ఆస్పత్రికి సుమారు 300 మంది టీకా  కోసం రాగా 200మందికి మాత్రమే టీకా వేశారు.  చౌటుప్పల్‌లో  వందలాది మంది రాగా కేవలం 250 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు.

వ్యాక్సిన్‌ వాయిల్స్‌ సరఫరా లేనందున మంగళవారం సెలవు కావడంతో బుధవారం వ్యాక్సినేషన్‌ ఉండదని వైద్యాధికారి పేర్కొన్నారు. భూదాన్‌పోచంపల్లి పీహెచ్‌సీకి వ్యాక్సిన్‌ కోసం సుమారు 500 మంది రాగా కేవలం 100మందికి టీకాలు వేశారు. దీంతో మిగతా వారు కూడా తమకి టీకాలు ఇవ్వాలని వైద్యసిబ్బందితో గొడవకు దిగారు.  అనంతరం చేసేదేమీ లేక చాలా మంది వెనుదిరిగి వెళ్లారు.  రామన్నపేటలో 500మంది రాగా కేవలంలో 116మందికి, యాదగిరిగుట్టలో  సుమారు 300మంది రాగా 110మందికి వ్యాక్సిన్‌ వేశారు. గుట్టలో మిగతవారు వైద్యసిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగి వెళ్లారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు