‘భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’

31 Aug, 2020 16:05 IST|Sakshi

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అంజనీ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం కోసం పోలీసు శాఖ పకడ్భంది ఏర్పాట్లు చేసిందన్నారు. గత వారం నుంచి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని, ఇప్పటి వరకు 30 వేల విగ్రహాలను నిమజ్జనం అయ్యాయని తెలిపారు.

మంగళవారం రాత్రి వరకు ఐదు ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తున్న 165 విగ్రహాలు, మూడు నుంచి ఐదు ఫీట్ల వరకు ఉన్న 1239, మూడు ఫీట్ల కంటే తక్కువ ఉన్న 1842 విగ్రహాలు నిమజ్జనం కాబోతున్నాయని, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. మొత్తం 21 క్రేన్లను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేశామని చెప్పారు. 1500పైగా పోలీసుల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఇతర వాహనాలకు అనుమతి లేదని, పలు చోట్ల ట్రాఫిక్‌ డైవర్షన్‌ చేశామని చెప్పారు. 

మరిన్ని వార్తలు