అమ్మొద్దు.. అన్యాక్రాంతం కానీయొద్దు

16 Jul, 2021 01:25 IST|Sakshi
ధర్నాలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి

ప్రభుత్వభూములను కాపాడాలని సీపీఐ డిమాండ్‌

లేదంటే ఎర్రజెండాలు పాతి పేదలకు పంచుతామన్న చాడ

పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి

సాక్షి, హైదరాబాద్‌/కరీంనగర్‌/ఖమ్మం: ప్రభుత్వ భూముల అమ్మకం, అసైన్డ్, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సీపీఐ పోరుబాట పట్టింది. గురువారం కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించింది. ఖమ్మం కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యతి్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరీంనగర్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని, కబ్జాలపై విచారణ జరిపి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్లు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. 16 వేల ఎకరాల ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకోవడంలో సర్కార్‌ వెనుకంజ వేస్తోందని మండిపడ్డారు. వేలం ఆపకపోతే ఎర్రజెండాలు పాతి పేదలకు పంచుతామని హెచ్చరించారు. రాష్ట్ర సహాయకార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి రంగారెడ్డి జిల్లాలో, కూనంనేని సాంబశివరావు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో, జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్‌ అజీజ్‌ పాషా, బీఎస్‌ బోస్‌ హైదరాబాద్‌లో, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు ఖమ్మంలో, పశ్య పద్మ కామారెడ్డిలో, బాలమల్లేశ్‌ మేడ్చల్‌ జిల్లాలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు