TS: పాత పింఛను సాధనే ధ్యేయం

1 Sep, 2021 21:27 IST|Sakshi

సీపీఎస్‌టీఈఏటీఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్

సాక్షి, హైదరాబాద్‌: భాగస్వామ్య పింఛను పథకం రద్దు, పాత పింఛను పథకం పునరుద్దరణ సాధనే తమ ధ్యేయమని తెలంగాణ కాంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (సీపీఎస్‌టీఈఏటీఎస్) రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. ఆయన బుధవారం జలసౌధలో సీపీఎస్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగానే గాక దేశ వ్యాప్తంగా కూడా పాత పింఛను పథకం సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యక్ష, పరోక్ష కార్యాచరణకు పూనుకున్నాయని తెలిపారు.

చదవండి: సారథి కావలెను: టీఆర్‌ఎస్‌ అధిష్టానం రహస్య సర్వే!

సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఎప్పటికప్పుడు హామీ ఇవ్వడం అధికార వర్గాలకు పరిపాటిగా మారిందని అన్నారు. సంఘం రాష్ట్ర సహా అధ్యక్షులు వారణాశి రామ కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగులు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు