విద్యార్థులను తీసుకొచ్చే పనిలో ఉన్నాం: సీఎస్‌

26 Feb, 2022 04:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు, ప్రవాసు లను రాష్ట్రానికి తీసుకురావ డానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంకు మొత్తం 150 కాల్స్‌ వచ్చాయని, అందులో ఉక్రెయిన్‌ నుంచి 10–12 కాల్స్‌ ఉన్నాయన్నారు.

ఫోన్‌ చేసిన వారి వివరాలు నమోదు చేసుకుని, విదేశీ వ్యవహారా లశాఖ, ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీకి అందజేస్తు న్నామని తెలిపారు. విద్యార్థులు, ఇతర ప్రవాసు లను ఉక్రెయిన్‌ నుంచి సరిహద్దులకు, అక్కడి నుంచి విమానాల ద్వారా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందన్నారు.

విమానాల సమాచారంసహా పూర్తి వివరాలను అక్కడి తెలంగాణ విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. ఇప్ప టికే ఆయా అంశాలపై ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ ఫస్ట్‌ సెక్రటరీతో మాట్లాడామని వివరిం చారు. తెలంగాణ విద్యార్థుల్లో ఎక్కువ మంది చదువుతున్న జఫరోజియా వర్సిటీకి సంబం ధించిన భారత ప్రతినిధితోనూ మాట్లాడామన్నారు.

మరిన్ని వార్తలు