TS: ‘ఉచిత విద్యుత్‌’ లబ్ధిదారుల నమోదుకు చర్యలు 

30 Jul, 2021 04:19 IST|Sakshi

అధికారులకు సీఎస్‌ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: సెలూన్లు, ధోబీఘాట్లకు సంబంధించి ఉచిత విద్యుత్‌ పథకం కింద అర్హులైన లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వీలుగా జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. లబ్ధిదారులు తమ దరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటీ శాఖ అధికారులను కోరా రు. పథకం అమలుపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 28,550 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు నివేదించారు.  

మరిన్ని వార్తలు