కమర్షియల్‌ సిలిండర్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌

11 Nov, 2022 07:46 IST|Sakshi

సాక్షి, పంజగుట్ట: వాణిజ్య అవసరాల కోసం వాడే ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగదారులకు ఊహించని షాక్‌ తగిలింది. సిలిండర్లపై ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు ఇచ్చే రాయితీని దేశ వ్యాప్తంగా పూర్తిగా ఎత్తివేశారని, ఈ విషయం వినియోగదారులు గ్రహించి సహకరించాలని తెలంగాణ ఎల్‌పీజీ డి్రస్టిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. 

గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా నెలకు 8 నుంచి 9 లక్షల వాణిజ్య సిలిండర్లు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి గతంలో వినియోగదారున్ని బట్టి 100 నుంచి 200 వరకు డిస్కౌంట్‌ లభించేదని దాన్ని పూర్తిగా ఎత్తేశారని తెలిపారు. ఎల్‌పీజీ ప్రమాదాలు ఇటీవల బాగా జరుగుతున్నాయని డిస్ట్రిబ్యూటర్స్‌ చెప్పే సేఫ్టీ ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు. ప్రమాదం జరిగితే రూ.40 లక్షల ఇన్సూరెన్స్‌ ఉంటుందని, ఇది రావాలంటే డిస్ట్రిబ్యూటర్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ ఉండాలన్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ శ్రీచరణ్, అశోక్, వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు