పోలవరం బ్యాక్‌వాటర్‌పై సమావేశం

25 Jan, 2023 01:17 IST|Sakshi

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలశక్తిశాఖ నిర్వహణ

పునరావాసం, ముంపు రక్షణ కోరుతున్న తెలంగాణ

సాక్షి, హైదరాబాద్‌: పోలవరం బ్యాక్‌ వాటర్‌ ముంపు ప్రభావంపై బుధవారం కేంద్ర జలశక్తి శాఖ..ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై గతేడాది సెప్టెంబర్‌ 29న కేంద్ర జలశక్తి శాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత సాంకేతికపరమైన అంశాలపై ముంపు ప్రభావిత రాష్ట్రాలతో చర్చలు, సంప్రదింపుల కోసం కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది.

పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాయగా, సీడబ్ల్యూసీ నుంచి బదులు వచ్చింది. ఈ సమాధానాలపై ఏమైనా అభ్యంతరాలుంటే 20లోగా పంపించాలని ఆయా రాష్ట్రాలను సీడబ్ల్యూసీ కోరింది. ఫిబ్రవరి 15న పోలవరం ముంపుపై సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యంలో 25న నిర్వహించనున్న సమావేశానికి ప్రాధాన్యత ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది. పోలవరం ముంపు ప్రభావిత ప్రాంతాలకు రక్షణతో పాటు బాధిత రైతులకు పరిహారం, పునరావాసం కల్పించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది.   

మరిన్ని వార్తలు :

Advertisement
మరిన్ని వార్తలు