తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్‌ చీటర్‌ వంశీకృష్ణ ఎట్టకేలకు అరెస్ట్‌

9 May, 2022 16:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ చీటర్‌ వంశీకృష్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ‍్యలో కేసులు నమోదు కాగా.. సోమవారం పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

 అయితే, ఉద్యోగాల పేరిట వంశీకృష్ణ దాదాపు రూ. 5కోట్ల వరకు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో 500 మంది యువతులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఆన్‌లైన్‌లో వితంతువులు, విడాకులు పొందిన మహిళలనే వంశీకృష్ణ టార్గెట్‌ చేసి మోసాలకు పాల్పడేవాడు. అయితే, వంశీకృష్ణ.. స్కీంల పేరుతో అటు ప్రజా ప్రతినిధులను సైతం మోసం చేశాడనే ఆరోపణలున్నాయి.
 

మరిన్ని వార్తలు