ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల యుగం.. డబ్బులు ఎవరికీ ఊరికే రావు

14 Jul, 2021 16:29 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి   

మూసాపేట: కష్టపడితేనే డబ్బులు వస్తాయని, షార్ట్‌ కట్‌లో తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకోవడం అసాధ్యమని సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. మంగళవారం కూకట్‌పల్లి రెయిన్‌బో విస్తాస్‌– 2లో సైబర్‌ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల యుగం నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మోసపోతారని హెచ్చరించారు.

కొత్త కొత్త పద్ధతులతో సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని, ఓటీపీ, సీవీవీ, బ్యాంక్‌ వివరాలు ఇతరులకు చెప్పవద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ బాలకృష్ణ, కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్‌రావు, సైబర్‌ సిటీ డెవలపర్స్‌ ఎండీ వేణు, రెయిన్‌బో విస్తాస్‌ ఫేజ్‌– 2 అధ్యక్షుడు నాగేంద్రబాబు, మాజీ అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి, యాంకర్‌ రవి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు