దయచేసి సాహసాలు చేయొద్దు: సీపీ సజ్జనార్‌

18 Oct, 2020 14:47 IST|Sakshi

అత్యవసరం ఉంటే 100 కి ఫోన్ చేయండి: సీపీ

సాక్షి, హైదరాబాద్‌:  భారీ వర్షాలు, వరద ముంపు నేపథ్యంలో ఏదైనా అత్యవసరం ఉంటే 100 కి ఫోన్ చేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సూచించారు. ఆయన ఆదివారం ఉదయం అధికారులతో కలిసి పల్లె చెరువు, అప్ప చెరువు, గగన్ పహాడ్, నీట మునిగిన పలు కాలనీల్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన‌ మాట్లాడుతూ.. ‘ఇబ్బందిగా ఉన్నవాళ్లని పునరావాస కేంద్రాలకు రావాలని చెప్పాం. వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న రెండు, మూడు రోజులు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. 
(చదవండి: హయత్‌ నగర్‌ కార్పోరేటర్‌పై దాడి)


అవసరమైతే తప్ప బయటకు రాకూడదు. దయచేసి వర్షం, వరద నీటిలో వాహనదారులు సాహసాలు చేయొద్దు. వరద నీటిలో చిక్కుకునే అవకాశం ఉంది. మళ్లీ వారిని బయటకు తీసుకురావాలంటే రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అందుకే ఎమర్జెన్సీ ఉంటే తప్ప జనాలు బయటకు రావొద్దు. ఇక​ నాలాల కబ్జాలపై అధికారులతో మాట్లాడాం. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. విద్యుత్‌ సరఫరా కూడా పునరుద్దరణ జరుగుతోంది’ అని సజ్జనార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు