ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతే!

14 Jan, 2021 13:33 IST|Sakshi

నిత్యం ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల్లో నిర్లక్ష్యం వీడటం లేదు. కళ్ల ముందు అనేక అనర్థాలు కంటపడుతున్నా.. చిన్న పిల్లల పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే  అన్యం పుణ్యం తెలియని ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో బలైపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజేంద్ర నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. అయితే అదృష్టం కొద్ది చిన్నారి ప్రాణాలతో బయటి పడింది. రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌ కింద పిల్లలు సరాదాగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పటికే రోడ్డు మీద చిన్న పాప ఆడుకోవాడాన్ని కారు డ్రైవర్‌ గమనించకుండా సడెన్‌గా అపార్ట్‌మెంట్‌ నుంచి కారు పాప మీద నుంచి బయటకు తీసుకెళ్లాడు. అయితే ఈ ఘటనలో అదృషవశాత్తు పాపకు ఎలాంటి హానీ జరగలేదు. కారు వెళ్లిన అనంతరం సరక్షితంగా లేచి నడుచుకుంటూ వెళ్లింది. చదవండి: విషాదం: ఏం కష్టం వచ్చిందో! 

దీనికి సంబంధించిన దృశ్యాలను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌లో గురువారం పోస్టు చేశారు. పిల్లలు ఇంటి సమీపంలో ఆడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ పోలీసులు కోరారు. ‘ఏమి జరగలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే అదృష్టం, దురదృష్టం, ఖర్మ, విధి... అని అనుకుని ఊరుకుండటం, తప్ప ఏమి చేయలేము. వాళ్ళు, వీళ్లు కాదు అందరూ సుకోవాల్సిందే. (డ్రైవర్ & తల్లిదండ్రులు) పిల్లాడికేం తెలుసు. అంత వయసులో తెలుసుకోగలిగే అవకాశమూ లేదే..’ అని ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీనిని చూసి నెటిజన్లు ఈ సంఘటన తల్లిదం‍డ్రులకు ఓ హెచ్చరిక అని కామెంట్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు