సర్రున దూసుకు వచ్చిన బండి.. గీత దాటారు.. దబిడి దిబిడే!

8 Jul, 2021 22:22 IST|Sakshi

హైదరాబాద్‌: సాధారణంగా టోల్‌ గేట్‌ వస్తే ఏం చేస్తారు. ఓ కిలో మీటరు దూరం నుంచే బండిని నెమ్మదిగా నడుపుకుంటూ వస్తారు. కానీ తాజాగా ఓ టాటా ఏసీ డ్రైవర్‌ టోల్‌ గేట్‌ దగ్గరకి సర్రున దూసుకొచ్చాడు. పైగా దాని టాప్‌పైన ప్యాసింజర్‌లను ఎక్కించుకున్నాడు. ఇంకేముంది టోల్‌ గేట్‌ బారికేడ్‌ అందులోని ప్రయాణికులను బాదడం మొదులు పెట్టింది. ఈ ఊహించని పరిణామానికి  షాక్‌ తిన్న వారు.. లబో దిబోమన్నారు.

ఈ వీడియోను ‘‘రాష్‌ డ్రైవింగ్‌.. వస్తువులను తీసుకెళ్లే బండిలో ప్రజలను తీసుకెళ్లడం ఎల్లప్పుడూ ప్రమాదకరం.’’ అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా తెగవైరలవుతోంది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ..‘‘సిగ్నల్ దగ్గర లైన్ దాటి వాహనాలు ఆపేవాళ్లకు ఇలాంటివి ప్లాన్ చేయండి సార్.’’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇక మరో నెటిజన్‌ ‘‘జీబ్రా లైన్స్ మీద క్రాస్ లైన్స్ దాటి ఆపేవారిని కూడా ఇలా కొట్టడానికి ఉంటే బాగుండు.’’ అంటూ రాసుకొచ్చారు.
 


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు