దెబ్బకు మత్తు దిగింది.. తిక్క కుదిరింది

3 Aug, 2021 14:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మద్యం తాగి వాహనాలు నడుపుతూ సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో చిక్కిన చోదకుల్లో 372 మందికి కోర్టులు జైలు శిక్ష విధించాయని ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. గత నెల 26 నుంచి 30 వరకు జరిగిన ప్రత్యేక డ్రైవ్‌ల్లో మొత్తం 621 కేసులు నమోదు చేశారు. వీటి చోదకులకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన ట్రాఫిక్‌ పోలీసులు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుల్లో హాజరుపరిచారు. చోదకులు తీసుకున్న మద్యం మోతాదు, నడిపిన వాహనం తదితరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఒక రోజు నుంచి 22 రోజుల వరకు జైలు శిక్షలు విధించాయి.

జైలుకు వెళ్లిన 372 మందిలో 186 మందికి ఒక రోజు, 101 మందికి రెండు రోజులు, 40 మందికి మూడు రోజులు, 18 మందికి నాలుగు రోజులు, 11 మందికి ఐదు రోజులు, ఇద్దరికి ఆరు రోజులు, అయిదుగురుకి వారం, నలుగురికి ఎనిమిది రోజులు, 10, 12, 16, 18 రోజుల చొప్పున ఒక్కొక్కరికి, మరో వ్యక్తికి 22 రోజుల జైలు శిక్ష పడింది. వీరికి కోర్టులు రూ.15.26 లక్షలు జరి మానా విధించాయి. వీరి డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దు చేయాలంటూ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు