కరోనా బెల్స్‌...ప్రొటీన్‌ ఫుడ్స్‌..

30 Apr, 2021 20:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం ఆరోగ్య కారణాల రీత్యా ప్రొటీన్‌ ఫుడ్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా బాధితులు, నివారణ జాగ్రత్తలు తీసుకుంటున్నవారు గుడ్లు చేపలు వగైరా ప్రొటీన్‌ రిచ్‌ ఫుడ్‌ తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో శాఖాహారులకు ఉపకరించేలా.. హైదరాబాద్‌కి చెందిన పాల ఉత్పత్తుల బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ తొలిసారి నేచురల్‌ పనీర్‌ని రూపొందించింది. దీనిని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ పన్నీర్‌ను ‘సాఫ్ట్‌ అండ్‌ క్రీమీ పన్నీర్‌’ గా పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీరు తెలిపారు.

నేచురల్‌ గా...
తెలంగాణా కేంద్రంగా ఆధునిక పాల ఉత్పత్తుల బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ తమ వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే లక్ష్యంతో అందిస్తున్న వాటిలో అతి కీలకమైన ఉత్పత్తి ఈ నేచురల్‌ పన్నీర్‌.  దీని తయారీ కోసం వినియోగించే పాలలో ఎలాంటి  హార్మోన్లు, యాంటీబయాటిక్స్‌ లేదంటే నిల్వ చేసే పదార్థాలను వాడకపోవడం దీనిలో విశేషం. ఈ కారణం చేత పన్నీర్‌  తాజాదనం, మృదుత్వం అలాగే ఉంటుంది.  తమ రోజువారీ ఆహారంలో  తగినంతగా ప్రొటీన్‌ను పొందాలని కోరుకునే శాఖాహారులకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది..  ఈ నేచురల్‌ పన్నీర్‌ 200 గ్రాముల ప్యాక్‌ 150 రూపాయల ధరలో లభిస్తుంది.

పనీర్‌ మార్కెట్‌ కి ఊపు..
ప్రస్తుత పరిస్థితుల్లో పనీర్‌ వినియోగం బాగా పెరిగింది. ‘ఇండియన్‌ డెయిరీ మార్కెట్‌ రిపోర్ట్‌ అండ్‌ ఫోర్‌కాస్ట్‌ 20212026 ’పేరిట ఈఎంఆర్‌ విడుదల చేసిన  నూతన అధ్యయనం భారతీయ డెయిరీ మార్కెట్‌ 2020లో  దాదాపు 145.55 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లుగా ఉంది. ఈ మార్కెట్‌ 20212026 మధ్యకాలంలో  6% సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో.. భారతదేశంలో 75వేల కోట్ల రూపాయలుగా ఉన్న పన్నీర్‌ మార్కెట్‌లో  తమ వాటాను సొంతం చేసుకోవడం కోసం కంపెనీలు లక్ష్యంగా చేసుకున్నాయి. అదే క్రమంలో తెలంగాణాలో స్థానిక బ్రాండ్‌గా ఉన్న సిద్స్‌ఫార్మ్‌ పెరిగిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. 
      
నేచురల్‌ పన్నీర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా  సిద్స్‌ ఫామ్స్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘తెలంగాణాలో ఆరోగ్యవంతమైన పాల ఉత్పత్తులను పరిచయం చేసిన ఒకే ఒక్క కంపెనీగా వినియోగదారులకు కల్తీలేని పాల ఉత్పత్తులను అందించాలన్నది మా బ్రాండ్‌ సిద్ధాంతం’’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు