దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ

18 Aug, 2021 13:51 IST|Sakshi

హైదరాబాద్: వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణకు వచ్చింది. నిబంధనలు ఖరారు చేయకుండానే నిధులు విడుదల చేశారని పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు. దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందని ఏజీ పేర్కొంది.

అయితే నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్‌సైట్‌లో లేదని పిటిషనర్  కోర్టుకు తెలిపారు. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు  ప్రశ్నించింది. జీవోలన్నీ 24 గంటల్లో వెబ్‌సైట్‌లో పెట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు