జవహార్‌నగర్‌ పాప మృతిపై సస్పెన్స్‌.. 10 పోలీసు బృందాలు ఏర్పాటు

17 Dec, 2022 10:20 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. పాప మృతికి గల కారణాలపై మిస్టరీ వీడలేదు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌లతో పాటు హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌తో విచారిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రుల మొబైల్‌ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

చిన్నారి ఇందుకు ఇవాళ(శనివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాప మృతికి గల అసలు కారణాలను వెలికి తీసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్‌ చేస్తున్న క్రమంలో దమ్మాయిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరగకుండా దమ్మాయిగూడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ కోసం చెరువు నీటిని సైతం పరీక్షలకు పంపించినట్లు సమాచారం. అలాగే.. గంజాయి సెవిస్తూ విచ్చలవిడిగా తిరిగే కొందరు అనుమానితులను సైతం జవహార్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక, సైంటిఫిక్‌ ఆధారాలతోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: బాలిక మిస్సింగ్‌ విషాదాంతం.. చెరువులో మృతదేహం లభ్యం

మరిన్ని వార్తలు