డేంజర్‌ కీటకాలు.. వాహనాలపై ముప్పేట దాడి

5 Apr, 2021 21:29 IST|Sakshi

కరీంనగర్: రాత్రిపూట కీటకాలు ప్రమాదకరంగా మారాయి. ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లోని కాకతీయ కాలువ వంతెనపై ప్రమాదంగా మారింది. రోజు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఆ వంతెనపై వాహనదారులు రాకపోకలు సాగించలేకపోతున్నారు.

ఈ సమయంలో కీటకాలు వేలాదిగా వచ్చి చేరుతుంటాయి. దీంతో మూడు గంటల పాటు బీభత్సం సృష్టించాయి. రాజీవ్ రహదారిపై కీటకాలు ముసురుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కీటకాలు ఏ రకం కీటకాలో తెలుసుకునేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కీటకాల నమూనాలను సేకరించి అధికారులు ల్యాబ్‌కి పంపారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు