‘తెలంగాణ తాలిబన్‌’గా మారిన కేసీఆర్‌ 

18 Aug, 2021 01:11 IST|Sakshi

కేసీఆర్‌ దళితబంధుతో డ్రామా చేస్తున్నారు 

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాలిబన్‌గా మారారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. తెలంగాణను బిహార్‌గా మారుస్తున్నారని, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. దళితబంధు పేరుతో రాజకీయ డ్రామా మొదలుపెట్టారన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో దాసోజు విలేకరులతో మాట్లాడారు. ఏడేళ్లు దళితులను పట్టించుకోని సీఎం.. ఇప్పుడు రసమయి మొదలుకుని దళిత నేతలను, నాయకులను కౌగిలించుకుంటున్నారని విమర్శించారు.

హుజూరాబాద్‌లోని శాలపల్లిలో ప్రభుత్వ సభలో కౌశిక్‌రెడ్డి, గెల్లు శ్రీనివాసు ఏ అధికారంతో కూర్చున్నారని ద్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చిల్లరగా వ్యవహరించారని, ప్రభుత్వ సభలో తెరాస నాయకులు కూర్చుంటే అతనికి సోయి లేదా? అని దుయ్యబట్టారు. సోమేశ్‌కుమార్‌ బాధ్యత మరిచి ఓ వ్యక్తికి బానిసలా పనిచేస్తున్నారని ఆరోపించారు.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన దండోరా సభను విజయవంతం చేయాలని కోరారు.  

మరిన్ని వార్తలు